రాప్తాడు బాలిక ఫొటోలు ప్రసారం..
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:53 AM
రాప్తాడు ఘటనలో తీవ్ర గాయాలపాలై, కోలుకుంటున్న బాలిక ఫొటోలు, వీడియోలు ప్రసారం చేసిన సాక్షి టీవీకి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నోటీసు జారీ చేసింది. బాధితురాలి పేరు, ముఖం, పాఠశాల, గ్రామం, ఆసుపత్రి వివరాలను వెల్లడించడంతో పాటు ...
జగన్ మీడియాకు బాలల హక్కుల కమిషన్ నోటీసు
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రాప్తాడు ఘటనలో తీవ్ర గాయాలపాలై, కోలుకుంటున్న బాలిక ఫొటోలు, వీడియోలు ప్రసారం చేసిన సాక్షి టీవీకి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నోటీసు జారీ చేసింది. బాధితురాలి పేరు, ముఖం, పాఠశాల, గ్రామం, ఆసుపత్రి వివరాలను వెల్లడించడంతో పాటు బాలికకు సంబంధించిన వీడియో, ఫొటోలను ఈనెల 25న సాక్షి టీవీలో ప్రసారం చేశారని తెలిపింది. జువైనల్ చట్టం-2015లోని సెక్షన్ 74, పోక్సో చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం ఇది నేరమని పేర్కొంది. ఆ వీడియో, ఫొటోలను వెంటనే టీవీ, యూట్యూబ్, వెబ్‌సైట్, సోషల్ మీడియా నుంచి తొలగించాలని నోటీసులో స్పష్టం చేసింది. ఏడు రోజుల్లో లఖితపూర్వకంగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..