‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:24 AM
‘కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ప్రకటించిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ(సర్) షెడ్యూల్‌ను పొడిగించింది.
డిసెంబరు 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ
ఏఎస్డీడీలకు 18 నుంచి 30 వరకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్
అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ప్రకటించిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ(సర్) షెడ్యూల్‌ను పొడిగించింది. రాష్ట్రంలో వచ్చే నెల 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం తెలిపారు.
‘రాష్ట్రంలో సర్ ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు దక్కని ఓటర్ల ఎన్యుమరేషన్‌కు ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. డిసెంబరు 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తాం’ అని తెలిపారు. కాగా, డిసెంబరు 15 వరకు క్లైయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించి, పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్