పెండింగ్ ఎన్నికల కేసులు త్వరగా తేల్చండి
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:53 AM
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన కోడ్ ఉల్లంఘన కేసులను త్వరితగతిన పరిష్కరించేలా కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు.
కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన కోడ్ ఉల్లంఘన కేసులను త్వరితగతిన పరిష్కరించేలా కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ పురోగతిపై గురువారం జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల స్థితిగతులపై పల్నాడు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటి పురోగతిని ఆయా జిల్లాల అధికారులు సీఈవోకు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.