Share News

వాట్సాప్‌ లింక్‌ పంపి.. 16.82 లక్షలు మాయం!

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:40 AM

ఆయన ఒక రైతు. కష్టించి పండించిన పంటను అమ్మగా వచ్చిన డబ్బు బ్యాంకులో దాచుకున్నారు. ఆయన వాట్సప్‌కు ఒక లింకు పంపిన సైబర్‌ నేరగాళ్లు.. విడతల వారీగా రూ.16,82,872 కాజేశారు.

వాట్సాప్‌ లింక్‌ పంపి.. 16.82 లక్షలు మాయం!

  • రైతు కష్టార్జితం మొత్తం ఊడ్చేసిన సైబర్‌ నేరగాళ్లు

పిడుగురాళ్ల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఆయన ఒక రైతు. కష్టించి పండించిన పంటను అమ్మగా వచ్చిన డబ్బు బ్యాంకులో దాచుకున్నారు. ఆయన వాట్సప్‌కు ఒక లింకు పంపిన సైబర్‌ నేరగాళ్లు.. విడతల వారీగా రూ.16,82,872 కాజేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రైతు బోనం కోటేశ్వరరావు... ఇటీవల మిరపకాయలు, కందులు, పత్తి విక్రయించారు. వచ్చిన డబ్బులను బ్రాహ్మణపల్లి చైతన్య గ్రామీణ బ్యాంక్‌, పిడుగురాళ్ల యూనియన్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశారు. ఈ నెల 12న గుర్తుతెలియని వాట్సాప్‌ లింక్‌ ఆయన మొబైల్‌కు వచ్చింది.

దాన్ని ఓపెన్‌ చేసిన వెంటనే కోటేశ్వరరావు సెల్‌ ఫోన్‌ను హ్యాక్‌ అయింది. ఆయన మొబైల్‌కు బ్యాంకు లావాదేవీల మెసేజ్‌లు రాకుండా చేసిన సైబర్‌ నేరగాళ్లు రోజుకు రూ.20వేలు, రూ.30వేలు, రూ.50 వేలు చొప్పున రెండు బ్యాంకుల్లో ఉన్న మొత్తం లాగేశారు. బుధవారం నాటికి చైతన్య గ్రామీణ బ్యాంక్‌లో మొత్తం ఖాళీ చేయగా, యూనియన్‌ బ్యాంక్‌లో మాత్రం రూ.450 ఉంచారు. ఖాతాలు ఖాళీ అయిన విషయం తెలుసుకున్న కోటేశ్వరరావు.. బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు నరసరావుపేటలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో, సైబర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 05:40 AM