జగన్... రాముడే నీ అరాచక పాలనకు ముగింపు పలికాడు: బుచ్చి రాంప్రసాద్
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:30 AM
వైఎస్ జగన్ కొత్తగా ‘హే రామ్’ అంటూ మరో రాజకీయ నాటకానికి తెరతీశారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
వైఎస్ జగన్ కొత్తగా ‘హే రామ్’ అంటూ మరో రాజకీయ నాటకానికి తెరతీశారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 2019-24 మధ్య జగన్మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జరిగిన రామతీర్థం, అంతర్వేది, విజయవాడ దుర్గ గుడిలో ఘటనలు జరిగినపుడు ఆయన ఏనాడైనా ‘హే రామ్’ అని అన్నారా? అని ప్రశ్నించారు.
‘‘రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు మాత్రమే ‘హే రామ్’, ఏసు ప్రభువు, మహమ్మద్ ప్రవక్త గుర్తుకొస్తారు. అధికార సాధనకు మతాన్ని వాడుకునే వ్యక్తి జగన్. పాత రోజుల్లో లాగా ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేయాలనే ‘గోబెల్స్ ప్రచారాలను’ నేటి తరం ప్రజలు నమ్మరు. ప్రభుత్వం వద్ద ప్రతి దానికీ స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి’ అని రాంప్రసాద్ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి