Share News

కార్యకర్తలతో మమేకం కావాలి

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:57 AM

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బూత్‌ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అరవింద్‌సింగ్‌ భదోరియా, సహ ఇన్‌చార్జి వనతి శ్రీనివాసన్‌ దిశా నిర్దేశం చేశారు. పార్టీకి పునాదిగా ఉన్న కార్యకర్తలను గుర్తించి

 కార్యకర్తలతో మమేకం కావాలి

  • స్థానిక ఎన్నికల్లో బలమున్న స్థానాలు కోరాలి

  • రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఏపీ ఇన్‌చార్జి భదోరియా, సహ ఇన్‌చార్జి వనతి దిశానిర్దేశం

అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బూత్‌ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అరవింద్‌సింగ్‌ భదోరియా, సహ ఇన్‌చార్జి వనతి శ్రీనివాసన్‌ దిశా నిర్దేశం చేశారు. పార్టీకి పునాదిగా ఉన్న కార్యకర్తలను గుర్తించి, వారితో నిరంతరం అనుసంధానమవుతూ క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయాలని సూచించారు. గురువారం విజయవాడలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో భదోరియా మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలను పార్టీ విస్తరణకు అవకాశంగా మలచుకోవాలని, కూటమి ధర్మాన్ని పాటిస్తూనే బీజేపీ బలంగా ఉన్న స్థానాలను కోరాలని చెప్పారు. పార్టీకి బలం ఉన్న స్థానాలను జిల్లాల వారీగా గుర్తించి నివేదికలు సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. వనతి శ్రీనివాసన్‌ మాట్లాడుతూ, ఏపీలో బీజేపీ బలోపేతమైందని, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు మరింత కష్టపడాల్సి ఉందని చెప్పారు.

పార్టీ బలోపేతమే లక్ష్యం: వల్లూరు

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్‌ మాట్లాడుతూ.. రానున్న రెండేళ్లలో పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 13,278 గ్రామాల్లో బీజేపీ తరఫున వార్డుల్లోనైనా ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే పార్థసారథి, వల్లూరు జేపీ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ కార్యక్రమాలను ఈ నెల 17 వరకు కొనసాగించనున్నట్లు వెల్లడించారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:57 AM