Share News

మళ్లీ స్థానిక ఫలితాలే: మాధవ్‌

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:49 AM

కోటి, రెండు కోట్ల వరకు నిధులు ఇచ్చి ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరునంలో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని పోలాసిగూడెం గ్రామస్థులంతా పార్టీలకు అతీతంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా...

మళ్లీ  స్థానిక ఫలితాలే: మాధవ్‌

అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో పట్టణ, పరిషత్‌ ఓటర్లు ఇచ్చిన తీర్పు పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతం కానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ అన్నారు. టీడీపీ, జనసేనతో కలిసి పట్టణాలు, మండలాలు, జడ్పీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ.. పంచాయతీ ఎన్నికల్లోనూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.

ఆదివాసీల ఆరాధ్యదైవం బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆదివారం విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ‘జనజాతీయ గౌరవ దివస్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాగా, ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం కర్షకుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 12:52 AM