Share News

రైతులకు అండగా ఉన్నా విమర్శలా: నీలాయపాలెం

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:09 AM

అర్నాబ్‌ తుఫాను వల్ల జరిగే ఆస్తి, ప్రాణనష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమించారని, బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని...

రైతులకు అండగా ఉన్నా విమర్శలా: నీలాయపాలెం

అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): అర్నాబ్‌ తుఫాను వల్ల జరిగే ఆస్తి, ప్రాణనష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమించారని, బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని వాస్తవం ఇలా ఉంటే గొడ్డలి పార్టీ మాత్రం కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు, విమర్శలతో కాలం వెళ్లబుచ్చుతోందని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్‌ నీలాయపాలెం విజయకుమార్‌ విమర్శించారు.

గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ హయాంలో 16 ప్రకృతి విపత్తులు సంభవిస్తే ఏనాడైనా సాయంత్రం 5 గంటల తర్వాత సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. బాధితులకు అండగా నిలవడంలో కూటమిది రికార్డుల పాలన అయితే వైసీపీది విదిలింపుల పాలన అని ఎద్దేవా చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 05:09 AM