Share News

ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కేసన

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:35 AM

‘రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంటే... భవిష్యత్తులో బీసీల సంక్షేమం, అభివృద్ధితో పాటు రిజర్వేషన్ల పెంపు కూడా సాధ్యమవుతుంది’ అని

 ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కేసన

గుంటూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంటే... భవిష్యత్తులో బీసీల సంక్షేమం, అభివృద్ధితో పాటు రిజర్వేషన్ల పెంపు కూడా సాధ్యమవుతుంది’ అని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు. ఆయన ఈమేరకు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ‘ఎన్డీఏ కూటమి పక్షాలకు బీసీలందరూ ఈ స్థానిక ఎన్నికలలో ఓట్లు వేసి ఘన విజయం చేకూర్చాలి. దివంగత ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు 34 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు జరుపుతూ వచ్చారు. స్థానిక సంస్థలలో కొన్ని జనరల్‌ స్థానాలలో కూడా బీసీలకు అవకాశం కల్పించి, ఇప్పటికి 41 శాతం స్థానిక రిజర్వేషన్లు కేటాయించడం ముదావహం’ అని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 04:35 AM