14న చలో ఢిల్లీ: బీసీ సంఘం
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:06 AM
జనగణన ఫార్మాట్ లో ఓబీసీ కాలమ్ చేర్చాలన్న డిమాండ్‌పై డిసెంబరు 14న చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నిర్ణయించింది.
అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): జనగణన ఫార్మాట్ లో ఓబీసీ కాలమ్ చేర్చాలన్న డిమాండ్‌పై డిసెంబరు 14న చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నిర్ణయించింది. జనగణనలో కులగణన చేపడతామని ప్రకటించిన కేంద్రం అందుకు సంబంధించి డేటా సేకరణ ఫార్మాట్‌లో ఓబీసీ కాలమ్ చేర్చలేదని, ఇది ఎన్నో అనుమానాలకు తావిస్తోందని సంఘం అధ్యక్షుడు కేసన శంకర్‌రావు పేర్కొన్నారు. దీనిపై కేంద్రాన్ని అనేక దఫాలుగా కోరినా స్పందన రాలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు డిసెంబరు 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఓబీసీ జనభేరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. హలో బీసీ- చలో ఢిల్లీ పేరిట ఈ కార్యక్రమం కొనసాగుతుందని, శుక్రవారం చలో ఢిల్లీ పోస్టర్‌ను విడుదల చేసినట్లు శంకర్ రావు ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..