బీడీ ఆకు వేలం బాధ్యతలు ఎఫ్‌డీసీకి
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:18 AM
రాష్ట్రంలో బీడీ ఆకు సేకరణ, విక్రయం, వేలం ద్వారా ఆదాయ సముపార్జనకు ప్రభుత్వ ఏజెంట్‌గా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ)ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీడీ ఆకు సేకరణ, విక్రయం, వేలం ద్వారా ఆదాయ సముపార్జనకు ప్రభుత్వ ఏజెంట్‌గా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ)ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని 11 యూనిట్లలో 2027 సీజన్‌లో బీడీ ఆకుల విక్రయం ద్వారా ఆదాయాన్ని సమకూర్చడానికి, బీడీ ఆకులు వేలం వేయడానికి టెండర్లు పిలవడానికి ఎఫ్‌డీసీ ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరించనున్నది.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా