56 కోట్లతో టూరిజం ఫెస్టివల్స్
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:22 AM
పర్యాటక శాఖ పరిధిలో ప్రతి ఏటా నిర్వహించే రాష్ట్ర, జిల్లా స్థాయి టూరిజం ఈవెంట్స్‌ను ప్రభుత్వం ప్రకటించింది. వాటికి అయ్యే ఖర్చులకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): పర్యాటక శాఖ పరిధిలో ప్రతి ఏటా నిర్వహించే రాష్ట్ర, జిల్లా స్థాయి టూరిజం ఈవెంట్స్‌ను ప్రభుత్వం ప్రకటించింది. వాటికి అయ్యే ఖర్చులకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.6 కోట్లతో అవకాయ-అమరావతి, రూ.5 కోట్లతో విజయవాడ ఉత్సవ్, రూ.4 కోట్లతో ఫుడ్ ఫెస్టివల్స్, విశాఖ ఉత్సవ్, అరకు ఫెస్టివల్, గండికోట ఉత్సవ్, ఫ్లెమింగో ఫెస్టివల్, కాకినాడ బీచ్ ఫెస్టివల్‌లను రాష్ట్ర కార్యక్రమాలుగా నిర్ణయించింది. వీటికి రూ.33 కోట్లు కేటాయించింది. అలానే జిల్లాల వారీగా నిర్వహించే కార్యక్రమాలకు రూ.23 కోట్లు కేటాయించింది. ఈ మేరకు పర్యాటక శాఖ కార్యదర్శి ఆమ్రపాలి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా