త్వరలో పంటల బీమా ప్రీమియం బకాయిల విడుదల: అచ్చెన్న
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:35 AM
గత ప్రభుత్వంలో పంటల బీమా ప్రీమియం బకాయిలు పేరుకుపోవడం వల్లే రైతులకు బీమా పరిహారం అందటంలో ఇబ్బందులు తలెత్తాయని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు.
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో పంటల బీమా ప్రీమియం బకాయిలు పేరుకుపోవడం వల్లే రైతులకు బీమా పరిహారం అందటంలో ఇబ్బందులు తలెత్తాయని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. పెండింగ్ ప్రీమియం బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని గురువారం వెల్లడించారు. 2026-27లో రూ.500కోట్లు, 2027-28లో రూ.1,000కోట్లు, 2028-29లో రూ.1,500కోట్లు చొప్పున మొత్తం రూ.3వేల కోట్లు చెల్లించే ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం ఆమోదించిందన్నారు. రాష్ట్ర వాటా అందిన వెంటనే పెండింగ్ క్లెయిమ్‌లను పరిష్కరించాలని బీమా కంపెనీలను కేంద్రప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. రైతులపై భారం పడకుండా, వైసీపీ ప్రభుత్వం సృష్టించిన సమస్యను పరిష్కరిస్తుంటే.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా