‘108’ల్లోనూ పాముకాటు విరుగుడు మందు
ABN , Publish Date - Sep 20 , 2026 | 04:42 AM
ప్రతి పాము కాటూ ప్రాణాంతకం కాదని, సరైన సమయంలో స్పందించి యాంటీ వెనమ్ డోస్ వేయించుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
ప్రభుత్వాస్పత్రుల్లో యాంటీ వెనమ్ నిల్వలు: మంత్రి సత్యకుమార్
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రతి పాము కాటూ ప్రాణాంతకం కాదని, సరైన సమయంలో స్పందించి యాంటీ వెనమ్ డోస్ వేయించుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 19 నుంచి 25 వరకు అంతర్జాతీయ పాముకాటు అవగాహన దినోత్సవ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి వాల్ పోస్టర్‌ను మంగళవారం మంత్రి తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులన్నింటిలో పాముకాటు విరుగుడు మందులు అందుబాటులో ఉందన్నారు. పాముకాటు బాధితులను ఆసుపత్రికి తరలించేలోపే వారిని రక్షించేలా 2026 జనవరి నుంచి 108 అంబులెన్సుల్లోనూ పాముకాటు విరుగుడు మందు అందుబాటులో ఉంచామన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు