Share News

తుపాను ప్రభావిత గ్రామాల్లో హోంమంత్రి అనిత పర్యటన.. పునరావాస కేంద్రాల్లో వసతులపై ఆరా

ABN , Publish Date - Oct 28 , 2026 | 08:59 AM

ఆర్నబ్ తుపాను నేపథ్యంలో హోంమంత్రి అనిత క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలను సందర్శించి, పునరావాస కేంద్రాల్లో వసతులు, అధికారుల సేవలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

తుపాను ప్రభావిత గ్రామాల్లో హోంమంత్రి అనిత పర్యటన.. పునరావాస కేంద్రాల్లో వసతులపై ఆరా
Cyclone Arnab

అనకాపల్లి, అక్టోబర్ 28: జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలిస్తూ ఎస్‌.రాయవరం, కోటవురట్ల మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించారు. ఎస్‌.రాయవరం మండలం చిన్నగుమ్ములూరు గ్రామంలో ప్రజలను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయనే విషయాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు.


పునరావాస కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారా అని మంత్రి అనిత ప్రజలను ప్రశ్నించారు. అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ అవసరమైన సేవలు అందిస్తున్నారని గ్రామస్తులు ఆమెకు తెలిపారు. కేంద్రాల్లో కల్పిస్తున్న వసతులు.. అందుతున్న సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో ప్రజల పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు అన్ని గ్రామాల్లో పర్యటించారు.


ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 11:31 AM