Share News

28న విద్యాసంస్థల్లో ఈ-వేస్ట్‌ క్యాంపెయిన్‌

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:11 AM

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ-వేస్ట్‌పై ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశాలు జారీచేశారు.

28న విద్యాసంస్థల్లో ఈ-వేస్ట్‌ క్యాంపెయిన్‌

అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ-వేస్ట్‌పై ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశాలు జారీచేశారు. ఇందులో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. ఇందులో భాగంగా ఈనెల 28న ఈ-వేస్ట్‌ నిర్వహణ, పునరుపయోగం, బాధ్యతాయుతంగా పారేయడంపై క్విజ్‌ నిర్వహిస్తారు. అదేరోజు ప్రత్యేక లింక్‌ ద్వారా వెబ్‌ పోర్టల్‌లో వచ్చే ప్రశ్నలకు ప్రధానోపాధ్యాయులు సమాధానాలు అప్‌లోడ్‌ చేస్తారు. పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో ఈ-వేస్ట్‌ కలెక్షన్‌ కార్నర్లు ఏర్పాటు చేస్తారు.

విద్యార్థులు తమ ఇళ్లలో వినియోగించని పాత ఎలక్ర్టానిక్‌ వస్తువులు, కేబుళ్లు, చార్జర్లు, పాత ఫోన్లు, ఇతర ఈ-వేస్ట్‌ను ఆ కలెక్షన్‌ కార్నర్‌లలో ఇస్తారు. వాటిని అక్కడి నుంచి మండల విద్యాశాఖ కార్యాలయాలకు తరలిస్తారు. గుర్తించిన రీసైక్లర్లకే వాటిని అప్పగిస్తారు. బ్యాటరీలు, సీఆర్‌టీ మానిటర్లు, ఎల్‌ఈడీ బల్బులను, ఇతర ప్రమాదకర ఎలక్ర్టానిక్‌ వస్తువులను విద్యార్థులు ఓపెన్‌ చేయకుండా చర్యలు తీసుకుంటారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 05:11 AM