ఏకగ్రీవం చేస్తే వంతెన నిర్మిస్తా
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:26 AM
సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తే వంతెన ఖర్చు తానే భరిస్తానంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి ముందుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కొండేపూడి ప్రజలు శ్మశానానికి వెళ్లాలంటే ...
పాలకోడేరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తే వంతెన ఖర్చు తానే భరిస్తానంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి ముందుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కొండేపూడి ప్రజలు శ్మశానానికి వెళ్లాలంటే నాటు పడవపై కాలువ దాటాల్సిన దుస్థితి. దీంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన పాలా సురేశ్.. తనను ఏకగ్రీవం చేస్తే అక్కడ వంతెనకయ్యే ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ గ్రామం బీసీ జనరల్‌కు కేటాయించారు. గతంలో పోటీ చేసి ఓడిన చింతపల్లి రామకృష్ణ ఈసారి కూడా పోటీలో ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు