Share News

అక్టోబరు 3ను జాతీయ డ్యామ్‌ సేఫ్టీ డేగా ప్రకటించాలి

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:12 AM

ఏటా అక్టోబరు మూడవ తేదీని జాతీయ జలాశయ భద్రతా దినోత్సవంగా ప్రకటించాలని నవ్యాంధ్ర విశ్రాంత ఇంజనీర్ల సంఘం కోరింది. ఈమేరకు జాతీయ జలాశయ భద్రతా సంస్థ(ఎన్‌డీఎస్ఏ)కు సంఘం అధ్యక్షుడు ఎన్‌ విశ్వేశ్వరరావు లేఖ రాశారు.

అక్టోబరు 3ను జాతీయ డ్యామ్‌ సేఫ్టీ డేగా ప్రకటించాలి

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఏటా అక్టోబరు మూడవ తేదీని జాతీయ జలాశయ భద్రతా దినోత్సవంగా ప్రకటించాలని నవ్యాంధ్ర విశ్రాంత ఇంజనీర్ల సంఘం కోరింది. ఈమేరకు జాతీయ జలాశయ భద్రతా సంస్థ(ఎన్‌డీఎస్ఏ)కు సంఘం అధ్యక్షుడు ఎన్‌ విశ్వేశ్వరరావు లేఖ రాశారు. ‘శ్రీశైలం జలాశయాన్ని 20.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా పటిష్ఠంగా నిర్మించారు. 2009 అక్టోబరు 1న 11.10 లక్షల కూసెక్కుల సాధారణ వరదతో మొదలై క్రమంగా 25.50 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీనిని కేంద్ర జల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ అనూహ్య వరద ప్రభావాన్ని సమష్ఠిగా ఎదుర్కొన్న తీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’ అని సంఘం ఎన్‌డీఎస్ఏకు తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 05:12 AM