Share News

పీఎం స్వనిధి’ అమలులో ఏపీ భేష్‌!

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:26 AM

పీఎం స్వనిధి’ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్‌ మెప్మా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడం పట్ల మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు.

పీఎం స్వనిధి’ అమలులో ఏపీ భేష్‌!

  • మెప్మాకు మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘పీఎం స్వనిధి’ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్‌ మెప్మా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడం పట్ల మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు పట్టణ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ అవార్డులు నిదర్శనమని పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం అమల్లో ఏపీ మెప్మా జాతీయ స్థాయిలో మూడో స్థానం సాధించగా, అత్యధిక సంఖ్యలో వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయడంలో రెండో స్థానంలో నిలిచింది. అలాగే ప్రత్యేక రుణ మేళాలు నిర్వహించడంలో దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీధి వ్యాపారుల కుటుంబాలకు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించే ‘స్వనిధి సే సమృద్ధి’ కార్యక్రమం అమల్లో రామచంద్రాపురం, అమలాపుర జాతీయస్థాయిలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Updated Date - Nov 21 , 2026 | 06:23 AM