రాష్ట్రానికి 6 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:40 AM
విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమహేంద్రవరం, తిరుపతి నగరపాలక సంస్థలతో పాటు కుప్పం మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు లభించడం గర్వించదగిన విషయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమహేంద్రవరం, తిరుపతి నగరపాలక సంస్థలతో పాటు కుప్పం మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు లభించడం గర్వించదగిన విషయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 11న న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేయనుందని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని పట్టణాలను పరిశుభ్రంగా, స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని వివరించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని స్వచ్ఛ అవార్డులు సాధించిన ఆరు పట్టణ స్థానిక సంస్థల అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది కృషి వల్లే రాష్ట్రానికి ఈ గుర్తింపు సాధ్యమైందంటూ మంత్రి నారాయణ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను డంపింగ్ యార్డులు లేని పట్టణాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..