Share News

ఉత్తర కోస్తాకు మరో ముప్పు!

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:14 AM

దక్షిణ అండమాన్‌ సముద్రంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో గురువారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి వచ్చేనెల 2 నాటికి ఉత్తర కోస్తాకు సమీపంగా రానుందని ఐరోపా వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

ఉత్తర కోస్తాకు మరో ముప్పు!

  • నేడు దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం

  • 2న ఉత్తర కోస్తాకు చేరువగా వచ్చే అవకాశం

దక్షిణ అండమాన్‌ సముద్రంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో గురువారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి వచ్చేనెల 2 నాటికి ఉత్తర కోస్తాకు సమీపంగా రానుందని ఐరోపా వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయితే ఇది అల్పపీడనం నుంచి వాయుగుండంగా బలపడుతుందా? లేదా? అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని సీనియర్‌ వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. అండమాన్‌ సముద్రంలో ఏర్పడే అల్పపీడనం బలపడినా, లేకపోయినా ఉత్తర కోస్తా దిశగా వస్తుందని, దీంతో వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. దీనివల్ల కోస్తాలో ముఖ్యంగా మధ్య కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ అధికారి ఒకరు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 06:54 AM