Share News

‘వక్ఫ్‌’ రెవెన్యూ రికార్డులు త్వరితగతిన ఇవ్వండి

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:03 AM

వక్ఫ్‌ భూములకు సంబంధించిన రెవెన్యూ, సర్వే రికార్డులు విజయవాడలోని వక్ఫ్‌ బోర్డు ప్రధాన కార్యాలయానికి, సంబంధిత వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆడిటర్లకు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను కోరారు

‘వక్ఫ్‌’ రెవెన్యూ రికార్డులు త్వరితగతిన ఇవ్వండి

  • కలెక్టర్లకు వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ విజ్ఞప్తి

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ భూములకు సంబంధించిన రెవెన్యూ, సర్వే రికార్డులు విజయవాడలోని వక్ఫ్‌ బోర్డు ప్రధాన కార్యాలయానికి, సంబంధిత వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆడిటర్లకు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్‌ బోర్డు వద్ద ఉన్న భూముల వివరాలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చే ప్రక్రియ జరుగుతోందని ఆయన తెలిపారు. సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణం, ఇతర నమోదుల్లో తేడాలు ఉంటే వాటిని గుర్తించి, ధ్రువీకరించిన వివరాల ఆధారంగా 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో అవసరమైన చేర్పులు, తొలగింపులు, సవరణలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 06:31 AM