Share News

ఓటు మా హక్కు.. వదులుకోం!

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:52 AM

పట్టణాల్లోని విద్యావంతులు, వ్యాపారులు ఓటు వేసేందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఈరోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో కూలీ పనులు చేసేవారు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 ఓటు మా హక్కు.. వదులుకోం!

పట్టణాల్లోని విద్యావంతులు, వ్యాపారులు ఓటు వేసేందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఈరోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో కూలీ పనులు చేసేవారు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జీవాల కాపరులు, కూలి చేసుకునేవారు గురువారం ఉదయమే పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేశాక, తమ పనుల్లోకి వెళ్లారు.

- శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి

నడుములోతు నీటిలో నదిని దాటి.. ఓటేసి!

ఓటు వేసేందుకు ఈ గ్రామాల ప్రజలు సాహసమే చేశారు. నడుము లోతున ప్రవహిస్తున్న నదిని దాటుకుని వచ్చి మరీ ఓటేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పెదపారన్నవలసలోని పోలింగ్‌ కేంద్రం పరిధిలోకి చినపారన్నవలస, పెదపారన్నవలస, భవానిపురం, రొంగళివానివలస గ్రామాలకు చెందిన 718 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా ఉధృతంగా ప్రవహిస్తున్న వేగవతి నదిని దాటి వచ్చి ఓటు వేశారు.

- సాలూరు, ఆంధ్రజ్యోతి

డోలీలో వచ్చి ఓటేసి!

  • ఏడు కిలోమీటర్లు మోసుకొచ్చిన వైనం

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ దబ్బలపాడు గ్రామస్థులు గురువారం కాలినడకన పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. నడవలేని స్థితిలో ఉన్న కోసూరి అప్పన్నదొర, గంగమ్మ అనే వృద్ధులను గ్రామస్థులు డోలీలో ఏడు కిలోమీటర్లు మోసుకుంటూ పెదరాభ తీసుకువచ్చారు. అక్కడ నుంచి వాహనంలో రొంపల్లి తీసుకువెళ్లి ఓటేయించారు.తిరిగి డోలీలో గ్రామానికి తీసుకెళ్లారు.

- అనంతగిరి, ఆంధ్రజ్యోతి

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 06:52 AM