వీబీజీరామ్‌జీ వ్యయంలో ఏపీ టాప్!
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:07 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో దేశంలోనే ముందున్న ఆంధ్రప్రదేశ్... వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీజీరామ్‌జీ) నిధుల ఖర్చులోనూ టాప్‌లో నిలిచింది. ఈనెల 27వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న రాష్ట్రాలవారీ వ్యయ నివేదిక ప్రకారం..
7,194 కోట్లతో దేశంలోనే ప్రథమస్థానం
నాలుగో స్థానంలో తెలంగాణ
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో దేశంలోనే ముందున్న ఆంధ్రప్రదేశ్... వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీజీరామ్‌జీ) నిధుల ఖర్చులోనూ టాప్‌లో నిలిచింది. ఈనెల 27వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న రాష్ట్రాలవారీ వ్యయ నివేదిక ప్రకారం.. ఏపీలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.7,194.87 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనాల కింద రూ.5,142.49 కోట్లు, మెటీరియల్ ఖర్చుల కింద రూ.2,052.38 కోట్లు వెచ్చించారు.
మహారాష్ట్ర రూ.3,290.98 కోట్లు, తమిళనాడు రూ.3,117.48 కోట్ల వ్యయంతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రూ.3,009.76 కోట్ల వ్యయంతో నాలుగో స్థానం దక్కించుకుంది. బిహార్ రూ.2,978.73 కోట్లు, రాజస్థాన్ రూ.2821.21 కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ.2,646.02 కోట్ల వ్యయంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి రూ.38,722.04 కోట్లు ఖర్చు చేశారు.
కూలీల వేతనాల వాటా రూ.28,663.69 కోట్లు కాగా, మెటీరియల్ ఖర్చులు రూ.10,058.35 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం వ్యయంలో ఏపీ వాటా సుమారు 18.6 శాతంగా ఉంది. తక్కువ వ్యయం చేసిన రాష్ట్రాల జాబితాలో గుజరాత్(రూ.301.01 కోట్లు), హిమాచల్‌ప్రదేశ్ (రూ.222.81 కోట్లు), ఉత్తరాఖండ్ (రూ.212.43 కోట్లు) ఉన్నాయి. హరియాణ రూ.79.48 కోట్లు, పశ్చిమబెంగాల్ రూ.73.81 కోట్లు, గోవా రూ.1.36 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట