Share News

నేడు లక్ష మంది ఆరోగ్య సిబ్బందికి మధుమేహ పరీక్షలు

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:15 AM

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘లక్షకు రక్షణ లక్ష్యం’ నినాదంతో శనివారం ఒకే రోజు కనీసం లక్ష మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి మధుమేహంతో పాటు...

నేడు లక్ష మంది ఆరోగ్య సిబ్బందికి మధుమేహ పరీక్షలు

అమరావతి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘లక్షకు రక్షణ లక్ష్యం’ నినాదంతో శనివారం ఒకే రోజు కనీసం లక్ష మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి మధుమేహంతో పాటు ఇతర సాధారణ దీర్ఘకాలిక వ్యాధుల పరీక్షలు నిర్వహించనున్నారు.

ఆరోగ్య సిబ్బంది ముందుగా తమకు తాము పరీక్షలు చేయించుకుని, వ్యాధుల ముందస్తు గుర్తింపు, నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరింది.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 01:17 AM