వైసీపీకి సాయం చేయాలన్న ఎస్‌ఐపై వేటు
ABN , Publish Date - Oct 30 , 2026 | 01:24 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి సాయం చేయాలని భావించి.. తోటి పోలీసులను ప్రలోభ పెట్టిన ఓ ఎస్‌ఐపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది.
సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ ఉత్తర్వులు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన నిర్ధారణ
నాయుడుపేట టౌన్/తడ, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి సాయం చేయాలని భావించి.. తోటి పోలీసులను ప్రలోభ పెట్టిన ఓ ఎస్‌ఐపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి జిల్లా దొరవారిసత్రం స్టేషన్‌లో ఎల్.సుధాకర రెడ్డి 2 ఏళ్లు ఎస్‌ఐగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు డీటీసీలో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.
దొరవారిసత్రంలో పరిచయమైన సిబ్బందితో పాటు నాయుడుపేట, వాకాడు స్టేషన్ల ఎస్‌ఐలు, సిబ్బందికి ఇటీవల ఫోన్ చేసి.. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు సాయం చేయాలని, ఆ సాయానికి రాబోయే రోజుల్లో ప్రతిఫలం అందేలా చూస్తానంటూ ప్రలోభపెట్టినట్లు సమాచారం. ఈ విషయం నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దృష్టికి తీసుకువెళ్లారు. ఐజీ విచారణలో ప్రలోభాలు వాస్తవమేనని తేలడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రలోభపెట్టిన కారణంగా ఎస్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు