Share News

రైస్‌ మిల్లులకు బ్యాంక్‌ గ్యారెంటీ నిబంధనలు

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:54 AM

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణ, సీఎంఆర్‌ కార్యకలాపాల ప్రక్రియలో రైస్‌ మిల్లులకు కేటాయించే ధాన్యానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ బ్యాంక్‌ గ్యారెంటీ (ఈ-బీజీ) నిబంధనలను నిర్దేశించింది.

రైస్‌ మిల్లులకు బ్యాంక్‌ గ్యారెంటీ నిబంధనలు

అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణ, సీఎంఆర్‌ కార్యకలాపాల ప్రక్రియలో రైస్‌ మిల్లులకు కేటాయించే ధాన్యానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ బ్యాంక్‌ గ్యారెంటీ (ఈ-బీజీ) నిబంధనలను నిర్దేశించింది. క్లస్టర్‌ ఒప్పందంతో ఉన్న సొంత రైస్‌ మిల్లులకు ప్రభుత్వం కేటాయించే ధాన్యం విలువకు సమానంగా 1:1 నిష్పత్తిలోనూ, లీజు మిల్లులకు 1:1.5 నిష్పత్తిలోనూ బ్యాంక్‌ గ్యారెంటీలు సమర్పించాలి. క్లస్టర్‌ ఒప్పందంలో లేని సొంత మిల్లులైతే 1:2 నిష్పత్తి, లీజు మిల్లులైతే 1:2.5 నిష్పత్తిలో ఈ-బిజీలు సమర్పించడం తప్పనిసరి.

బ్యాంక్‌ గ్యారెంటీ సరిపోని మిల్లులకు ధాన్యం కేటాయింపులు నిలిపివేస్తారు. ఈ నిబంధనల అమలుకు అనుగుణంగా ధాన్యం సేకరణ పోర్టల్‌లో రైస్‌ మిల్లుల వర్గీకరణ, ఈ-బీజీల ఆధారంగా ధాన్యం కేటాయింపుల కోసం అవసరమైన మార్పులు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌, ప్రభుత్వ ఎక్స్‌-అఫిషియో సెక్రటరీ కె.కన్నబాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్లు, పౌరసరఫరాల మేనేజర్లు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని అందులో స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 04:54 AM