నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:40 AM
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరుగనుంది.
తాగునీటికి మరో 9 టీఎంసీలివ్వాలని ఏపీ వినతి
అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరుగనుంది. సోమవారం హైదరాబాద్‌లో బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి హాజరుకానున్నారు. తక్షణ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి 9 టీఎంసీలను తమకు విడుదల చేయాలని బోర్డును ఏపీ ఇప్పటికే కోరింది. సాగర్ కుడికాలువ నుంచి ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 14వ తేదీ దాకా 10.4 టీఎంసీలను రాష్ట్రానికి విడుదల చేశారని గుర్తు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీటి కొరత ఉన్నందున ఎన్‌టిఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు సాగర్ ఎడమ కాలువ ద్వారా 8 టీఎంసీలు, కుడి ప్రధాన కాలువ ద్వారా ఒక టీఎంసీ నీటిని 3 నెలల పాటు విడుదల చేయాలని విజ్ఞప్తిచేసింది. ‘తెలంగాణ ఇప్పటికే కృష్ణా జలాలను అధికంగా వాడుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ అవార్డు మేరకు 512 టీఎంసీల దామాషా మేరకు నీరివ్వాలి. నాగార్జున సాగర్ వద్ద కేంద్రం అమలు చేస్తున్న జల్‌జీవన్ మిషన్ కింద తాగునీటి పథకం కోసం ఇన్‌టెక్ వెల్‌ను నిర్మించినందున.. ఆ అంశం కేఆర్‌ఎంబీ పరిధిలోకి రాదు’ అని సోమవారంనాటి భేటీలో స్పష్టం చేయనున్నట్లు జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలూ చదవండి
పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!