ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం...
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:30 AM
ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరిని ప్రదర్శించిన ఇద్దరు పోలీసు అధికారులపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.
ములకల చెరువు సీఐ, ఎస్‌ఐలపై చర్యలు
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరిని ప్రదర్శించిన ఇద్దరు పోలీసు అధికారులపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ములకలచెరువు సీఐ కె.దస్తగిరి, ఎస్‌ఐ పి.రామకృష్ణలను ఈ నెల 24న విధుల నుంచి రిలీవ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కర్నూలు రేంజ్ డీఐజీ పంపిన ప్రతిపాదనల మేరకు పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు ఎస్‌ఈసీ ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలోని ఎర్ర చందనం స్మగ్లింగ్ వ్యతిరేక టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె.రాజారెడ్డిని మొలకలచెరువు సీఐగా, ఎస్‌ఐగా మదనపల్లి తాలూకా పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న జి.చంద్రమోహన్‌ను నియమించేందుకు ఆమోదం తెలిపింది. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఆదేశాలిచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట