Share News

నేను రెండు కోట్లిస్తా.. నేను మూడెకరాలిస్తా..

ABN , Publish Date - Nov 15 , 2026 | 01:45 AM

పంచాయతీ సర్పంచ్‌ పదవులకు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి ఈ పదవులను ఏకగ్రీవంగా దక్కించుకోవడానికి ఆశావహులు బేరసారాలు సాగిస్తున్నారు.

నేను రెండు కోట్లిస్తా.. నేను మూడెకరాలిస్తా..

  • సర్పంచ్‌ పదవులకు భలే గిరాకీ!

  • ఏకగ్రీవాల కోసం పలు పంచాయతీల్లో పోటాపోటీ

  • మాకంటే ఎక్కువిస్తే పోటీ నుంచి తప్పుకొంటాం

  • తునిలో వైసీపీ మద్దతుదారు ప్రకటన

శంఖవరం, భీమవరం రూరల్‌, యాడికి, ద్వారకాతిరుమల, ఆలూరు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పంచాయతీ సర్పంచ్‌ పదవులకు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి ఈ పదవులను ఏకగ్రీవంగా దక్కించుకోవడానికి ఆశావహులు బేరసారాలు సాగిస్తున్నారు. గ్రామాభివృద్ధికి కొందరు రూ.కోటి, రూ.రెండు కోట్లు ఇస్తామంటే.. మరికొందరు ఎకరం, రెండెకరాలను ఇస్తామని ముందుకొస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా కత్తిపూడిలో వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఏకగ్రీవంగా సర్పంచ్‌ పదవి కట్టబడితే గ్రామాభివృద్ధికి రూ.2 కోట్లు ఇస్తామని ఆ పార్టీ ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షుడు గౌతు సత్యనారాయణస్వామి ప్రకటించారు. కత్తిపూడిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము గ్రామాభివృద్ధికి రెండు కోట్లు ఇస్తామని, ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. ఇంకెవరైనా తమకంటే ఎక్కువ నిధులు ఇస్తే తమ అభ్యర్థిని పోటీలో ఉండకుండా సహకరిస్తామన్నారు.

ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్పలో పంట భూమి ఇచ్చే బేరసారాలు పోటీగా మారాయి. నిన్న రెండు ఎకరాలు ఇస్తానని కె.రాము అనే వ్యక్తి చెప్పగా, నేడు తాతాజీ అనే వ్యక్తి మూడు ఎకరాలు ఇస్తాను.. తననే సర్పంచ్‌గా ఎన్నుకోవాలన్నారు. అనంతపురం జిల్లా రాయలచెరువు సర్పంచ్‌ పదవికి రూ.కోటి ఇస్తానని ఒక పారిశ్రామికవేత్త ఆఫర్‌ ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం


ఏకగ్రీవం చేస్తే ఎంతైనా ఇస్తాం..

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల సర్పంచ్‌ పదవిని తనకు ఇస్తే రూ.50 లక్షలు ఇస్తానని ఎం.శ్రీనివాసరావు చెప్పగా, రూ.60 లక్షలు ఇస్తానని సీహెచ్‌ ధర్మారావు, బీసీ వ్యక్తిని ఏకగ్రీవం చేస్తే రూ.కోటి ఇస్తాడని కేశవాచారి (జనసేన చెప్పగా, పంచాయతీ కార్యాలయానికి మూడు ఏసీలు, ట్రక్కుతో ట్రాక్టర్‌ ఇస్తానని పి.కిరణ్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.

కర్నూలు జిల్లాలో ఏకగ్రీవానికి బ్రేక్‌

కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి సర్పంచ్‌ పదవికి ఆఫర్ల మొత్తం రూ.1.10 కోట్లకు చేరింది. అయితే, ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీ, వైసీపీ మద్దతుదారులు ఎన్నికల్లో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ ఒకరిద్దరు ఆశావహులు భారీ ఆఫర్లతో ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 02:47 AM