ఆర్టీసీ చైర్మన్ కొనకళ్లకు అస్వస్థత.. సికింద్రాబాద్ తరలింపు
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:13 AM
ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు.
తాడేపల్లి టౌన్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వైద్యులు బ్రెయిన్‌లో రక్తపు గడ్డ (క్లాట్) ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనంతరం సర్జరీ నిమిత్తం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారఽథి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, బోడె ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి తదితరులు ఆయన్ను పరామర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..