Share News

మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.8.93 కోట్లు

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:21 AM

రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.8.93 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీజే అబ్దుల్‌ కలాం ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ పథకం, అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి (ఏవోవీఎన్‌) పథకాల కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులను విడుదల చేస్తూ..

మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.8.93 కోట్లు

అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.8.93 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీజే అబ్దుల్‌ కలాం ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ పథకం, అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి (ఏవోవీఎన్‌) పథకాల కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులను విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిధుల్లో క్రిష్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు రూ.80.43 లక్షలు, మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు రూ.812.63 లక్షలు కేటాయించారు. మొత్తం రూ.8.93 కోట్లు విడుదలకు అనుమతించారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 04:21 AM