నెమలిగుండంలోకి జలధార
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:53 AM
నల్లమల అడవిలో కురిసిన వర్షాలకు నెమలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రంలోని నీటి గుండంలోకి జలపాతం దూకుతోంది.
నల్లమల అడవిలో కురిసిన వర్షాలకు నెమలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రంలోని నీటి గుండంలోకి జలపాతం దూకుతోంది. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో గుండంలోకి నీరు చేరలేదు. గుండ్లకమ్మలో నీటి ప్రవాహం కోసం ఎదురుచూస్తున్న రైతులకు తుఫాన్‌తో కురిసిన వానలు ఊరటనిచ్చాయి.
- రాచర్ల, ఆంధ్రజ్యోతి
కనువిందు చేస్తున్న భైరవకోన జలపాతం
మార్కాపురం జిల్లా సీఎస్‌పురం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోన త్రిముఖ దుర్గాంబ అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న భైరవకోనలో జలపాతం కనువిందు చేస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక.. మూడురోజుల క్రితం వరకు ఇక్కడ చుక్క నీరు లేదు. తుఫాన్ కారణంగా నాలుగైదు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు పడటంతో కొండ పైనుంచి జలపాతంలోకి నీరు చేరుతోంది.
- సీఎస్‌పురం(పామూరు), ఆంధ్రజ్యోతి
ముడసర్లోవ రిజర్వాయర్‌కు జల కళ
విశాఖపట్నంలోని ముడసర్లోవ జలాశయం జల కళను సంతరించుకుంది. రిజర్వాయర్ కనిష్ఠ నీటి మట్టం 151, గరిష్ఠంగా 169 అడుగులు. ఈ రిజర్వాయర్ వేసవిలో పూర్తిగా ఎండిపోయింది. ఆతర్వాత ఎల్‌నినో కారణంగా డెడ్‌స్టోరేజీకి చేరింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మూడు రోజులుగా భారీవర్షాలు కురవడంతో రిజర్వాయరులోకి నీరు చేరింది. ప్రస్తుతం నీటిమట్టం 163 అడుగులకు చేరింది.
- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ