Share News

కోస్తాలో మెరుగు.. సీమలో తరుగు

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:58 AM

వరుస తుఫాన్లతో రాష్ట్రంలో వానలోటు 29 శాతం తీరింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లోటు 53శాతం ఉండగా.. సెప్టెంబరులో వాయుగుండంతో కురిసిన వర్షాలకు లోటు 9శాతం తగ్గి, 44శాతానికి వచ్చింది.

కోస్తాలో మెరుగు.. సీమలో తరుగు

  • వరుస తుఫాన్లతో తగ్గిన వర్షపాతం లోటు

  • రాష్ట్రంలో 53 నుంచి 24 శాతానికి తగ్గుదల

  • కోస్తాలోని 16 జిల్లాల్లో సాధారణ స్థాయికి

  • 12 జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్న లోటు

  • అత్యధికంగా మార్కాపురం జిల్లాలో 58శాతం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): వరుస తుఫాన్లతో రాష్ట్రంలో వానలోటు 29 శాతం తీరింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లోటు 53శాతం ఉండగా.. సెప్టెంబరులో వాయుగుండంతో కురిసిన వర్షాలకు లోటు 9శాతం తగ్గి, 44శాతానికి వచ్చింది. గతనెలలో అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు లోటు మరింత తగ్గి 31శాతానికి చేరింది. తాజాగా మురసు తుఫాన్‌ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వానలోటు 24శాతానికి తగ్గింది. భూగర్భ జలాలు కూడా మెరుగయ్యాయి.వర్షం నీరు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లకు మరలి, నీటి లభ్యత పెరిగింది.

కోస్తాలో గరిష్ఠంగా 0-18 శాతం మెరుగుదల ఉండగా, సీమలో ఇంకా 21-56 శాతం లోటు నెలకొంది. అత్యధికంగా మార్కాపురం జిల్లాలో 58శాతం లోటు ఉంది. జూన్‌ 1 నుంచి నవంబరు 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా 781.3 మిల్లీమీటర్ల వాన పడాల్సి ఉండగా, 594.8 మిల్లీమీటర్లు నమోదైంది. నవంబరులో ఈ 5 రోజుల్లో సాధారణ వర్షపాతం 33.5 మిల్లీమీటర్లకుగాను 74.4 మిల్లీమీటర్ల వాన పడింది. దీంతో ప్రస్తుతం కోస్తాలోని 16 జిల్లాల్లో వాన లోటు తీరి సాధారణ స్థాయికి చేరగా, నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, పల్నాడు జిల్లాలతోపాటు రాయలసీమలోని 8 జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 04:58 AM