Share News

విద్యుత్‌ సిబ్బంది పనితీరు భేష్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 07:00 AM

అర్నబ్‌, మురసు తుఫానులు సృష్టించిన బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ వ్యవస్థ తేరుకుందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు.

 విద్యుత్‌ సిబ్బంది పనితీరు భేష్‌

  • 11,537 మంది రేయింబవళ్లు శ్రమించారు

  • క్షేత్రస్థాయి పరిస్థితిపై సమీక్షలో కె.విజయానంద్‌

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): అర్నబ్‌, మురసు తుఫానులు సృష్టించిన బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ వ్యవస్థ తేరుకుందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు. సిబ్బంది అద్భుత పనితీరుతో తుఫానుల ప్రభావంతో గోదావరి జిల్లాలతోపాటు బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థ క్రమంగా గాడినపడిందని అన్నారు. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమించారని పేర్కొన్నారు. గురువారం విజయవాడ విద్యుత్‌ సౌధలోని స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ను సందర్శించిన అనంతరం క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

వరద నీరు పోటెత్తుతున్నా లెక్కచేయకుండా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల సహకారంతో పనిచేసిన విద్యుత్‌ సిబ్బంది అంకితభావాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో చెరువుల్లో స్తంభాలు పడిపోవడం, భారీగా వరద నీరు చేరడంతో కొత్త స్తంభాల ఏర్పాటుకు కొంత సమయం పడుతోందని, అయితే అక్కడ తాత్కాలిక ఏర్పాట్ల ద్వారా విద్యుత్‌ అందిస్తున్నామని విజయానంద్‌ తెలిపారు. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే వెంటనే విద్యుత్‌ శాఖ టోల్‌-ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్లకు సమాచారం అందించాలని విజయానంద్‌ విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 07:00 AM