అదే అరాచకం!
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:42 AM
ఓటమి భయంతో ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో కూటమి శ్రేణులపై దాడులకు దిగిన వైసీపీ.. గురువారం జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ అరాచకానికి దిగింది. ఆ పార్టీ కార్యకర్తలు పలు చోట్ల దాడులకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేశారు.
పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీ బరి తెగింపు.. బ్యాలెట్ బాక్సుల ధ్వంసం...ఓట్ల చించివేత
పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీ బరి తెగింపు
బ్యాలెట్ బాక్సుల ధ్వంసం.. ఓట్ల చించివేత
పులివెందులలో పెట్రోలు బాంబులతో దాడులు
జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి కుమారుడి
వీరంగం.. ఏజెంట్లను పోనీయకుండా అడ్డగింత
గుండ్లకుంటలో టీడీపీ ఏజెంట్లకు బెదిరింపులు
అనంతలో గొడవలు, ఘర్షణలతో బీభత్సం
గుమ్మనూరులో వైసీపీ ఏజెంట్ తీరును
ప్రశ్నించిన బీజేపీ నాయకుడిపై భౌతిక దాడి
శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్‌పై దాడికి యత్నం
కల్యాణదుర్గం ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి
రాజంపేటలో వైసీపీ తెచ్చిన రౌడీల కళ్లలో
కారం కొట్టి అడ్డుకున్న స్థానిక మహిళలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): ఓటమి భయంతో ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో కూటమి శ్రేణులపై దాడులకు దిగిన వైసీపీ.. గురువారం జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ అరాచకానికి దిగింది. ఆ పార్టీ కార్యకర్తలు పలు చోట్ల దాడులకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేశారు. వాటిలో ఇంకు పోశారు. బాక్సులను పోలింగ్ బూత్‌ల నుంచి తీసుకొచ్చి బయటపడేశారు. ముఖ్యంగా కడప జిల్లాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. పులివెందుల మండలంలోని ఎర్రిబల్లిలో ఓటర్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి.
దీంతో వైసీపీ నేతలు పెట్రోలు బాంబులు విసిరారు. టీడీపీ కార్యకర్తలు కూడా పెట్రోలు బాంబులతో దాడులకు దిగారు. దాదాపు అరగంట సేపు పెట్రోలు బాంబులు, రాళ్ల దాడులతో ఎర్రిబల్లి దద్దరిల్లింది. చివరకు పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అచ్చిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్ల విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మొదలైన గొడవ.. రాళ్ల దాడులకు దారితీసింది. ఆర్.తుమ్మలపల్లెలో వైసీపీ దాడులకు పాల్పడగా.. టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. లింగాల మండలంలోని పార్నపల్లెకు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మందీమార్బలంతో వెళ్తుండగా.. డీఎస్పీ మురళీనాయక్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటు చేసుకుంది.
రాజంపేట నియోజకవర్గం నందలూరులో పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ చేసేందుకు వైసీపీ నేతలు కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, తిరుపతి నుంచి పలు వాహనాల్లో రౌడీమూకలను దించారు. స్థానిక మహిళలు ఆ వాహనాలను అడ్డుకుని రౌడీల కళ్లలో కారంకొట్టి దాడి చేశారు.
జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం గుండ్లకుంటలో టీడీపీ ఏజెంట్లను కూర్చోనివ్వకుండా వైసీపీ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి కుమారుడు అడ్డుకున్నారు.
బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం ఎస్.రామాపురం పోలింగ్ బూత్‌లో వైసీపీ నేతలు బ్యాలెట్ బాక్సులో ఇంక్ పోశారు.
అనంతలో రచ్చరచ్చ..
అనంతపురం జిల్లావ్యాప్తంగా పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంటే... వైసీపీ పలు ప్రాంతాల్లో గొడవలు, ఘర్షణలకు దిగింది. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం మరుట్ల రెండో కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ వర్గీయులు చొరబడ్డారు. బ్యాలెట్ బాక్సులను బయటపడేసి ధ్వంసం చేశారు. బ్యాలెట్ పేపర్లను బయటకు తీసి చించేశారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఈ కుట్ర పన్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు.
కుందుర్పి మండలం బెస్తరపల్లిలో కల్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై వైసీపీ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. వారిని అడ్డుకోబోయిన ఎమ్మెల్యే గన్‌మన్‌పై దాడి చేశారు.
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో వైసీపీ వర్గీయులు పెట్రోలుతో నింపిన ప్లాస్టిక్ కవర్లను రోడ్డుపై వేసి నిప్పంటించారు. దీంతో ఉద్రిక్తతలు చెలరేగి నలుగురు గాయపడ్డారు.
చిత్తూరు జిల్లా కడపల్లెలోని పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ శ్రేణులు దూసుకొచ్చేందుకు యత్నించాయి.
కుప్పంలోని నడిమూరు పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పళణిపై వైసీపీ కార్యకర్త జయకుమార్ దాడి చేశాడు.
అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం లక్ష్మీరెడ్డిగారిపల్లెలో వైసీపీ నాయకులు బ్యాలెట్ బాక్సును బయట పడేశారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ళ మండలం లంకెలకూరపాడులో టీడీపీ నాయకులపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు.
శ్రీకాకుళం మండలం కిష్టప్పపేట ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు ఎమ్మెల్యే గొండు శంకర్ క్యూలైన్‌లో నిలబడ్డారు. అదే సమయంలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి భర్త ఎచ్చెర్ల శ్రీధర్, ఆయన అనుచరులు ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు.
శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువులో పోలింగ్ ముగిసిన తర్వాత వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై దాడిచేశారు.
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో గురువారం పోలింగ్ సమయంలో వైసీపీ అభ్యర్థి లాల్ స్వామి పోలింగ్ ఏజెంట్ ఓటు వేయని వారి పేర్లు బయటకు వచ్చి చెబుతున్నాడని భావించిన బీజేపీ నాయకుడు నారాయణ అభ్యంతరం తెలిపారు. దీంతో నారాయణపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి, రక్తం వచ్చేలా కొట్టారు.
నూజివీడు మండలం తూర్పు దిగవల్లి పోలింగ్ స్టేషన్ వద్ద ఒక వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ