Vijayawada: బాలికపై అత్యాచారం.. ఫొటోలు బయటపెడతానని బెదిరింపు
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:42 PM
ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఏపీలో మైనర్ బాలికపై అత్యాచారం చేయడమే కాదు.. బెదిరింపులకు పాల్పడ్డాడో వ్యక్తి.
విజయవాడ, జనవరి 07: చందర్లపాడు మండలం విపరింతలపాడులో ఓ మైనర్‌పై అత్యాచారం జరిగింది. ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన జాషువా(21) అనే యువకుడు బాలికను మోసం చేశాడు. వివరాల్లోకెళితే.. 14ఏళ్ల బాలిక.. పక్క గ్రామంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ జడ్పీహెచ్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. క్రిస్మస్ సెలవుల సందర్భంగా స్వగ్రామానికి వచ్చింది. అదే గ్రామంలో ఉంటున్న జాషువా అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.
డిసెంబర్ 26న.. ఆ బాలిక ఇంట్లో ఎవరూలేని సమయంలో చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. ఈ విషయం ఎవరికైనా చెబితే తనతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. బాలిక ఆనారోగ్యంగా ఉండటంతో.. ఆమె తల్లి ఏం జరిగిందని ప్రశ్నించగా అసలు విషయం చెప్పిందామె. తల్లిదండ్రులు గ్రామ పెద్దలను ఆశ్రయించగా అక్కడ రాజీ కుదరకపోవడంతో ఈ రోజు (బుధవారం) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష
For More AP News And Telugu News