Share News

గుడ్డు.. సూపర్‌ ఫుడ్‌..!

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:22 AM

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఆహారాల్లో కోడి గుడ్డు ముందువరుసలో ఉంటుంది. మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు గుడ్డులో లభిస్తాయి.

గుడ్డు.. సూపర్‌ ఫుడ్‌..!

  • చౌకైన పోషక వనరులు మెండు.. నేడు వరల్డ్‌ ఎగ్‌ డే

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఆహారాల్లో కోడి గుడ్డు ముందువరుసలో ఉంటుంది. మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు గుడ్డులో లభిస్తాయి. చికెన్‌, మటన్‌ లేదా కొన్ని రకాల పప్పులతో పోల్చితే కోడిగుడ్డ ధర చాలా తక్కువ. కానీ.. దీనిలో లభించే పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. అందుకే దీన్ని ‘సూపర్‌ ఫుడ్‌’, ‘కంప్లీట్‌ ప్రోటీన్‌’ అంటారు. ఇంతటి అమోఘమైన పోషక విలువలున్న కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 1,190.88 లక్షల కోళ్లతో రాష్ట్రంలో పౌల్ర్టీ రంగం బలీయంగా ఉండగా.. 2024-25లో 2,739.04 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. దేశంలో ఉత్పత్తి అవుతున్న 14,911 కోట్ల గుడ్లలో ఇది 18.37 శాతం. ఇక రాష్ట్రంలో తలసరి గుడ్ల వినియోగం ఏడాదికి 108గా ఉండగా. జాతీయ సగటు 104గా ఉంది.

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: అచ్చెన్న

శుక్రవారం వరల్డ్‌ ఎగ్‌ డే సందర్భంగా కోళ్ల రైతులు, పౌల్ర్టీల నిర్వాహకులు, గుడ్లు వినియోగదారులకు పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గుడ్డులోని పోషక విలువలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పౌల్ట్రీ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పౌల్ట్రీలో వ్యాధుల నియంత్రణ, బయో సెక్యూరిటీ, శాస్త్రీయ యాజమాన్యం, పరిశుభత్ర, సురక్షిత గుడ్ల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ అమరేంద్ర కుమార్‌ చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 05:23 AM