Share News

విశాల్ గున్ని సస్పెన్షన్ వ్యవహారం.. క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

ABN , Publish Date - May 05 , 2026 | 06:51 PM

ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. క్యాట్ ఉత్తర్వులపై స్టే విధించింది. కేసుపై లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది.

విశాల్ గున్ని సస్పెన్షన్ వ్యవహారం.. క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
Vishal Gunni case

అమరావతి, మే 5: ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. క్యాట్ ఉత్తర్వులపై స్టే విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సినీ నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగం కేసులో విశాల్ గున్నిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై విశాల్ గున్ని క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే విశాల్ గున్ని సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేసి ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకుని పోస్టింగ్ ఇవ్వాలని గత ఏడాది ఆగస్టు 28వ తేదీన క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులను రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.


డీజీపీ, సీఎస్ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సస్పెన్షన్ కాల పరిమితి ముగియక ముందే ఉత్తర్వులను క్యాట్ రద్దు చేసిందని, దాని కారణంగా విచారణ ముందుకు వెళ్లలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇక, విశాల్ గున్ని తరుఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఇరు వర్గల వాదనలు విన్న అనంతరం క్యాట్ ఉత్తర్వులపై స్టే విధిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కేసుపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

తమిళనాడు అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని ప్రధాని మోదీని కోరిన విజయ్

అడ్మిషన్‌ షెడ్యూల్‌పై ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం

Updated Date - May 05 , 2026 | 06:59 PM