జగన్ మాజీ సీపీఆర్ఓ శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు
ABN , Publish Date - Apr 22 , 2026 | 06:12 PM
శ్రీహరి, గిరీశ్‌ల పిటిషన్‌లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇద్దరి అభ్యర్థనలను కోర్టు తిరస్కరించింది. అరెస్టు చేస్తారనేందుకు ఆధారాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది.
అమరావతి, ఏప్రిల్ 22: తమను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాజీ సీపీఆర్ఓ శ్రీహరి, వైసీపీ సోషల్ మీడియా నేత గిరీశ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్‌లు వేసిన సంగతి తెలిసిందే. శ్రీహరి, గిరీశ్‌ల పిటిషన్‌లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇద్దరి అభ్యర్థనలను కోర్టు తిరస్కరించింది. అరెస్టు చేస్తారనేందుకు ఆధారాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది.
కుప్పం కోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేశామని, రద్దు చేయలేదని తెలిపింది. చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
చిత్ర పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో యువ నటి మృతి..
ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌పై చర్యలు తీసుకోవాలి.. కేంద్రానికి బండి సంజయ్ లేఖ