Share News

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుబ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్‌ చేశాం

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:30 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బ్యాంకు ఖాతాను డీఫ్రీజ్‌ చేసినట్టు హోం శాఖ అధికారులు హైకోర్టుకు తెలిపారు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుబ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్‌ చేశాం

  • హైకోర్టుకు హోం శాఖ వెల్లడి

  • పిటిషన్‌ను డిస్పోజ్‌ చేసిన కోర్టు

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బ్యాంకు ఖాతాను డీఫ్రీజ్‌ చేసినట్టు హోం శాఖ అధికారులు హైకోర్టుకు తెలిపారు. దీంతో అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం డిస్పోజ్‌ చేసింది. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి, ప్రలోభ పెట్టారనే కారణంతో కాకినాడ జిల్లా, సర్పవరం పోలీసులు అనంతబాబుపై గతంలో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన బ్యాంకు ఖాతాను ఫ్రీజ్‌ చేశారు. అయితే, ఖాతా ప్రీజ్‌ చేయడానికి ముందు తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, కారణం కూడా చెప్పకుండా కాకినాడ ఎస్‌బీఐలోని సేవింగ్స్‌ ఖాతాను ఫ్రీజ్‌ చేశారని పేర్కొంటూ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. తన ఖాతాను డీఫ్రీజ్‌ చేసేలా పోలీసులు, బ్యాంక్‌ అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకురాగా హోంశాఖ తరఫున ప్రభు త్వ న్యాయవాది స్పందిస్తూ.. పిటిషనర్‌ సేవింగ్స్‌ ఖాతాను ఈ నెల 17న డీఫ్రీజ్‌ చేశారన్నారు. ఈ వివరాలు నమోదు చేసిన న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వై. లక్ష్మణరావు వ్యాజ్యాన్ని డిస్పోజ్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 06:21 AM