బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ సీఈవో తొలగింపు
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:50 AM
బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధికారుల ఒత్తిడి కారణంగా బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస శర్మ మరణించడంతో ప్రభుత్వం ఆ సంస్థపై దృష్టి పెట్టింది.
ఉద్యోగి మృతి వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు
అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధికారుల ఒత్తిడి కారణంగా బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస శర్మ మరణించడంతో ప్రభుత్వం ఆ సంస్థపై దృష్టి పెట్టింది. ఉద్యోగి మృతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ సీఈవో జి.నాగసాయిని ప్రభుత్వం తొలగించింది. ఆయన మాతృసంస్థ అయిన రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సోసైటీకి బదిలీ చేస్తూ దేవదాయ శాఖ సెక్రటరీ కన్నబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఇన్‌చార్జి ఏర్పాట్లు చేసుకోవాలని బ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ ఎండీని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఉద్యోగి మృతి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు