Share News

పేదల గృహ నిర్మాణానికి 120 కోట్లు

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:18 AM

రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 120.89 కోట్ల నిధులు విడుదలకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

పేదల గృహ నిర్మాణానికి 120 కోట్లు

  • బడ్జెట్‌ కేటాయింపులకు అదనంగా నిధులు

అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 120.89 కోట్ల నిధులు విడుదలకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌లో గృహ నిర్మాణ సంస్థకు కేటాయించిన నిధుల నుంచి ఇప్పటికే రూ. 247.30 కోట్ల నిధులు కేటాయించగా.. తాజాగా మరో రూ. 120.89 కోట్లు అదనంగా విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి కొర్లపాటి హెప్సిబారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 04:18 AM