Share News

ఒక్కో బాధితుడికి రూ.1000

ABN , Publish Date - Oct 30 , 2026 | 03:47 AM

అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొంది, తిరిగి వెళ్లే బాధితులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కోవ్యక్తికి రూ.1,000 చొప్పున, కుటుంబానికి గరిష్ఠంగా రూ.3,000 చొప్పున నగదు సాయం..

ఒక్కో బాధితుడికి రూ.1000

  • కుటుంబానికి గరిష్ఠంగా 3000 ప్రత్యేక సాయం

  • తుఫాన్‌ ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు

  • బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, పంచదార, పామాయిల్‌

  • పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలకు మరో నాలుగేసి కోట్లు

అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాన్‌ కారణంగా సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొంది, తిరిగి వెళ్లే బాధితులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కోవ్యక్తికి రూ.1,000 చొప్పున, కుటుంబానికి గరిష్ఠంగా రూ.3,000 చొప్పున నగదు సాయం అందించాలని తుఫాన్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. తుఫాన్‌ సహాయక చర్యల తక్షణ అవసరాల కోసం ఇప్పటికే 20 జిల్లాలకు రూ.27 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ఈ నిధుల నుంచి వ్యయం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే తుఫాన్‌కు ప్రభావితమైన అన్ని కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయాలని మరో ఉత్తర్వు జారీ చేసింది.

ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కిలోలు, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార, లీటర్‌ పామాయిల్‌ పంపిణీ చేయడానికి 20 జిల్లాల కలెక్టర్లకు అనుమతి ఇచ్చింది. దీంతో పాటు తుఫాన్‌ సహాయక చర్యల కోసం పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లకు తక్షణ ఖర్చుల కోసం ప్రత్యేకంగా చెరో రూ.4 కోట్లు డ్రా చేసుకునేందుకు అనుమతిస్తూ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 03:56 AM