రీ సర్వే డీటీల పదవీకాలం ఏడాది పొడిగింపు
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:55 AM
రీ సర్వే ప్రాజెక్టులో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ పోస్టులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): రీ సర్వే ప్రాజెక్టులో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ పోస్టులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నాటికి రీ సర్వేను పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున, రీ సర్వే డీటీ పోస్టులను వచ్చే ఏడాది సెప్టెంబరు 22 వరకు పొడిగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు(జీవో 629) జారీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి..