Share News

చివరి వ్యక్తి వరకు సాయం

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:03 AM

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో సాధారణ పరిస్థితి నెలకొనే వరకు ఎవరూ విశ్రమించకుండా లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది కష్టపడుతున్నారని కొనియాడారు.

చివరి వ్యక్తి వరకు సాయం

  • సాధారణ స్థితి వచ్చేదాకా విశ్రమించొద్దు

  • నేటి సాయంత్రానికల్లా పనులవ్వాలి

  • బాధితులందరికీ పరిహారం అందించాలి

  • పంట నష్టం అంచనాలు సిద్ధం చేయాలి

  • ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చెప్పాలి

  • జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలు

  • ఉదయమే వారితో టెలికాన్ఫరెన్స్‌

  • కోనసీమ నుంచి తిరిగొచ్చాక మళ్లీ సమీక్ష

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో సాధారణ పరిస్థితి నెలకొనే వరకు ఎవరూ విశ్రమించకుండా లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది కష్టపడుతున్నారని కొనియాడారు. చివరి వ్యక్తికి సాయం అందేవరకూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. గురువారం ఉదయం వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆ తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ వ్యూ, క్షేత్రస్థాయి పర్యటన చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 04:03 AM