అర్ధరాత్రి.. నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి..!
ABN , Publish Date - Oct 27 , 2026 | 03:38 AM
రోజూ తనతో ఆడుకునే ఆరేళ్ల చిన్నారిని గంజాయి మత్తులో ఉన్న ఓ కామాంధుడు చిదిమేశాడు. అభంశుభం తెలియని ఆ బాలిక అమ్మమ్మ చెంతన నిద్రపోతుండగా.. అర్ధరాత్రివేళ్ల చేతులతో ఎత్తుకెళ్లి మరీ హత్యాచారం చేశాడు.
గంజాయి మత్తులో ఆరేళ్ల బాలికపై హత్యాచారం
కామాంధుడిని స్తంభానికి కట్టేసి చితక్కొట్టిన స్థానికులు
పెట్రోలు పోసినిప్పంటించే ప్రయత్నం
నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్
పోలీసులు, ఎమ్మెల్యే చొరవతో ఆందోళన విరమణ
ప్రకాశంలో అమానవీయ ఘటన
నాగులుప్పలపాడు, అక్టోబరు26 (ఆంధ్రజ్యోతి): రోజూ తనతో ఆడుకునే ఆరేళ్ల చిన్నారిని గంజాయి మత్తులో ఉన్న ఓ కామాంధుడు చిదిమేశాడు. అభంశుభం తెలియని ఆ బాలిక అమ్మమ్మ చెంతన నిద్రపోతుండగా.. అర్ధరాత్రివేళ్ల చేతులతో ఎత్తుకెళ్లి మరీ హత్యాచారం చేశాడు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఆదివారం అర్ధరాత్రి ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సంతనూతలపాడు మండలం ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం వారు హైదరాబాద్ వెళుతూ తమ కుమార్తె(6)ను చదలవాడలోని అమ్మమ్మ వద్ద వదిలి వెళ్లారు. భార్యాభర్తల మధ్య వివాదాల నేపథ్యంలో ఒంగోలు మండలం గుడిమెళ్లపాడుకు చెందిన అజ్జం ఆనంద్(27).. బాలిక అమ్మమ్మ ఇంటికి పక్కనే ఉన్న తన అమ్మమ్మ పేరమ్మ ఇంట్లో మూడు నెలలుగా ఉంటున్నాడు.
ఈ క్రమంలో బాలిక అమ్మమ్మ ఇంటికి ఆనంద్ తరచూ వెళుతుండేవాడు. అప్పుడప్పుడూ అక్కడే తింటూ రోజూ చిన్నారితో ఆడుతూ ఉండేవాడు. ఈక్రమంలో ఆదివారం అర్ధరాత్రి బాలిక తన అమ్మమ్మ, పిన్నిలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో.. ఆనంద్ వచ్చి ఆ చిన్నారిని చేతులపై పడుకోబెట్టుకొని తన అమ్మమ్మ పేరమ్మ ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలిక నోట్లో గుడ్డ కుక్కి లైంగికదాడికి పాల్పడ్డాడు. చిన్నారి అపస్మారక స్థితిలోకి జారిపోవడంతో భయపడిన నిందితుడు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లోని కుర్చీలో బాలికను కూర్చోబెట్టి, ఆ ఇంటి మచ్చుపై దాక్కొన్నాడు. అప్పటికే బాలిక కోసం ఆమె అమ్మమ్మ, పిన్ని, కొందరు కాలనీవాసులు వెతుకులాట ప్రారంభించారు.
కొంతసేపటికి బాలిక అపస్మారక స్థితిలో కుర్చీలో ఉండడాన్ని గుర్తించారు. మేనమామ సురేశ్ ఆ చిన్నారిని హుటాహుటిన ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. ఇంటి మచ్చుపై దాక్కొన్న నిందితుడు ఆనంద్‌ను గుర్తించిన కాలనీవాసులు బయటకు లాక్కొచ్చి విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు.
దిగ్ర్భాంతికి గురిచేసింది
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో ఆరేళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన దిగ్ర్భాంతికి గురిచేసిందని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. బాలిక కుటుంబ సభ్యులను సోమవారం ఆమె పరామర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్