Share News

బీసీ రిజర్వేషన్లపై ఏపీ పిటిషన్.. విచారణకు నిరాకరించిన సుప్రీం కోర్టు

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:31 AM

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ అంశంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

బీసీ రిజర్వేషన్లపై ఏపీ పిటిషన్.. విచారణకు నిరాకరించిన సుప్రీం కోర్టు
SC On Local Bodies BC reservation in AP

ఇంటర్నెట్ డెస్క్: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తాజాగా కొట్టేసింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టం చేసింది.


స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌ను 34 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవోలను జారీ చేసింది. వీటిని హైకోర్టు పక్కన పెట్టేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పేర్కొంటూ హైకోర్టు జీవోలను రద్దు చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కానీ రిజర్వేషన్లు 50 శాతం మించరాదంటూ సుప్రీం కోర్టు మరోసారి స్పష్టం చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

నెల్లూరులో ప్రభుత్వ హైస్కూల్ ఆధునికీకరణ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన

శ్రీకాకుళంలో కదులుతున్న రైలు నుంచి కిందపడిన యువతి మృతదేహం

Updated Date - Oct 09 , 2026 | 12:00 PM