Share News

ఆర్‌అండ్‌బీ బిల్లుల కోసం 600 కోట్లు

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:59 AM

రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత సాస్కీ స్కీమ్‌ కింద రహదారి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రధాన రహదారులు, జిల్లా రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు...

ఆర్‌అండ్‌బీ బిల్లుల కోసం 600 కోట్లు

రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత సాస్కీ స్కీమ్‌ కింద రహదారి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రధాన రహదారులు, జిల్లా రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు రూ.600 కోట్ల బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ఆ నిధుల విడుదలకు రూ.325 కోట్లు, రూ.275 కోట్లకు వేర్వేరుగా బీఆర్‌వోలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ నిధుల వినియోగానికి ఆర్‌అండ్‌బీకి పరిపాలనా అనుమతి లభించింది.

బిల్లుల చెల్లింపునకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌అండ్‌బీ కార్యదర్శి కోన శశిధర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో స్టేట్‌హైవేల అభివృద్ధి పనులకు స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ కాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ (సాస్కీ-ఎస్ఏఎస్‌సీఐ) కింద రూ. 325 కోట్లు, ఎండీఆర్‌ వర్క్‌లకు రూ.275 కోట్లు కాంట్రాక్టర్లకు ఆర్‌అండ్‌బీ చెల్లించనుంది. ఈ మేరకు ఇంజనీరింగ్‌ చీఫ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 04:59 AM