Share News

గ్రామాల్లో రైతన్నా మీకోసం వారోత్సవాలు

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:57 AM

మండలంలోని నిమల్లాపల్లిలో సోమవారం రైతన్న మీకోసం వారోత్సవాలను కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచుతూ పీఎంకిసాన, అన్నదాత సుఖీభవ పథకాల గురించి అవగాహన కల్పించారు.

  గ్రామాల్లో రైతన్నా మీకోసం వారోత్సవాలు

గోరంట్ల, మార్చి16 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని నిమల్లాపల్లిలో సోమవారం రైతన్న మీకోసం వారోత్సవాలను కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచుతూ పీఎంకిసాన, అన్నదాత సుఖీభవ పథకాల గురించి అవగాహన కల్పించారు.


కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న విషయంపై వివరించారు. ఏపీఎంఐసీ యాప్‌ ద్వారా అనేక రకాల సేవలను పొందవచ్చని తెలిపారు. ప్రతి రైతు యూనిక్‌ ఐడీ కలిగి ఉండాలని సూచించారు. కాగా వ్యవసాయాధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ముద్రించకపోవడంతో బీజేపీ నాయకులు అవమానంగా భావించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ,జనసేన కన్వీనర్లు బాలక్రిష్ణచౌదరి, సంతోష్‌, నాయకులు నిమ్మల విద్యాధరణి నిమ్మల శ్రీధర్‌, వెంకటరెడ్డి, మహమ్మద్‌, నరేష్‌, చంద్ర, రవినాయక్‌, శీనా తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం

Updated Date - Mar 17 , 2026 | 12:58 AM